“సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది...

Scan the qr code to link to this page

హదీస్
వివరణ
అనువాదాలను వీక్షించండి
Benefits from the Hadith
కూర్పులు
ఇంకా
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా విన్నానని అన్నారు :- “సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసుల్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు: ‘నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను, అందులో ఒక సగభాగము నా కొరకు, మరియు మరొక సగభాగము అతని కొరకు.” మొదటి సగభాగము: అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించుట, ఆయనను మహిమపరుచుట. అందుకొరకు నేను అతనికి ప్రతిఫలములలో శుభప్రదమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. రెండవ సగభాగము: దుఆ అంటే మొరపెట్టుకొనుట. నేను అతని మొరను ఆలకిస్తాను మరియు అతడు అర్థించిన దానిని ప్రసాదిస్తాను. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి “అల్’హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు అల్లాహ్ “నా దాసుడు నన్ను కీర్తించినాడు” అని అంటాడు; ”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు, మరియు సృష్ఠి మొత్తంపై ఉన్న నా అనుగ్రహాన్ని, కరుణను అతడు గుర్తించినాడు” అని అంటాడు; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, అల్లాహ్ “నా దాసుడు నన్ను కొనియాడినాడు, మరియు అది ఒక గొప్ప గౌరవం” అంటాడు. దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, అల్లాహ్ “ఇది నాకు, నా దాసునికి మధ్యనున్న విషయం” అంటాడు. ఈ ఆయతులో మొదటి సగభాగము (ఇయ్యాక న’బుదు – ‘మేము కేవలం నిన్నే (నిన్ను మాత్రమే) ఆరాధిస్తాము’) అల్లాహ్ కు చెందినది. ఇందులో ‘అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు’ అనే దాసుని ఒప్పుకోలు, మరియు దానికి జవాబుగా అతడు అల్లాహ్ ను ఆరాధించుట ఉన్నాయి – దానితో (సూరతుల్ ఫాతిహాలో) అల్లాహ్ కు చెందిన మొదటి సగభాము ముగుస్తుంది. ఈ ఆయతులో రెండవ సగభాగము – అది దాసునికి చెందినది: (ఇయ్యాక నస్తఈన్) ఇందులో అల్లాహ్ నుండి సహాయం కొరకు అర్థింపు ఉన్నది. మరియు అది అతనికి ప్రమాణం చేయబడింది. దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం*, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు: “ఇది నా దాసుని దుఆ మరియు అతడు నాకు పెట్టుకునే మొర. అతడు అర్థించినది అతనికి ప్రసాదించబడుతుంది, మరియు నిశ్చయంగా అతడు అర్థించిన దానిని నేను ప్రసాదించాను.”

Benefits from the Hadith

  1. సూరతుల్ ఫాతిహా యొక్క అత్యంత గొప్ప ఘనత ఏమిటంటే అల్లాహ్ దానిని ‘సలాహ్’ అని సంబోధించినాడు.
  2. ఇందులో తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కరుణ కటాక్షము ఉన్నాయి: ఇందులో అతడు అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తున్నాడు, ఆయనను స్తుతిస్తున్నాడు, ఆయనను పొగుడుతున్నాడు – అల్లాహ్ అతడు అర్థించిన దానిని అతనికి ప్రసాదిస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు.
  3. అత్యంత ఘనమైన ఈ సూరహ్ లో అల్లాహ్ యొక్క స్తుతి, ఆయనను కీర్తించుట, పునరుత్థాన దినము యొక్క ప్రస్తావన, అల్లాహ్ కు మొరపెట్టుకొనుట, ఆయనకు దుఆ చేయుట, ఆయనను ఆరాధించుటలో నిష్కల్మషత్వము కలిగి ఉండాలనే హితబోధ, ‘సన్మార్గము వైపునకు మార్గదర్శకము’ కొరకు అర్థింపు, అసత్యము మరియు అసత్య మార్గముల పట్ల హెచ్చరిక – ఇవన్నీ ఉన్నాయి.
  4. ఈ హదీసు ద్వారా సలాహ్ ఆచరించు వ్యక్తికి కలిగే ప్రయోజనం: సూరతుల్ ఫాతిహా పఠనం సలాహ్ లో భయభక్తులను, మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

కూర్పులు

విజయవంతంగా పంపబడింది