“ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”...

Scan the qr code to link to this page

హదీస్
వివరణ
అనువాదాలను వీక్షించండి
Benefits from the Hadith
కూర్పులు
ఇంకా
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే రాత్రి (నిద్రించడాని ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క ఆఖరి రెండు ఆయతులు పఠిస్తాడో, అల్లాహ్ అతనికి కీడు నుంచి, మరియు అయిష్టమైన ప్రతి విషయము నుంచి సరిపోయేలా (రక్షణ) చేస్తాడు, అని తెలియజేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కొంతమంది ఉలమా ఇలా అభిప్రాయపడ్డారు “సరిపోయేలా చేస్తాడు అంటే – ఆ రెండు ఆయతులను అతని రాత్రి నమాజు (తహజ్జుద్) కు సరిపోయేలా చేస్తాడు”; మరి కొంతమంది ఉలమా “(ఆరాత్రి అతడు చేయ దలచిన) ఇతర రకాల ఆరాధనలకు సరిపోయేలా చేస్తాడు అని అర్థము” అన్నారు; మరికొంతమంది ఉలమా “ఆ రెండు ఆయతులు, రాత్రి నమాజు కొరకు (ఖియాముల్లైల్) తక్కువలో తక్కువగా సరిపోయే ఆయతులు” అన్నారు. ఇంకా వేర్వేరు అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే పైన తెలుపబడిన అభిప్రాయాలు అన్నీ కూడా సరియైనవే, విలువైనవే, ఎందుకంటే ఆ వాక్యము (సరిపోయేలా చేస్తాడు) పరిధిలోనికి ఇవన్నీ కూడా వస్తాయి.

Benefits from the Hadith

  1. ఈ హదీసు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి ఆయతుల ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నది. ఈ ఔన్నత్యము “ఆమనర్రసూలు బిమా ఉన్’జిల ఇలైహి మిర్రబ్బిహిమ్...” (ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసిం చాడు....) అనే అల్లాహ్ వాక్కులతో మొదలై, సూరహ్ చివరి వరకు కొనసాగుతుంది.
  2. ఎవరైతే సూరతుల్ బఖరహ్ యొక్క ఈ చివరి భాగము రాత్రి పడుకోబోయే ముందు పఠిస్తారో, అతని నుండి కీడు, చెడు మరియు షైతానులను అది దూరం చేస్తుంది.
  3. రాత్రి సూర్యుడు అస్తమించడంతో ప్రారంభమవుతుంది, మరియు సూర్యుడు ఉదయించడంతో ముగుస్తుంది.

కూర్పులు

విజయవంతంగా పంపబడింది