నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?...

Scan the qr code to link to this page

హదీస్
వివరణ
అనువాదాలను వీక్షించండి
Benefits from the Hadith
కూర్పులు
ఇంకా
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఆనాటి బహుదైవారాధకులలో ఎన్నో హత్యలు, మరెన్నో మానభంగాలకు పాల్బడిన, ఒక సమూహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా పలికినారు: “నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?” అపుడు (ఈ ఆయతు) అవతరించినది: “మరియు ఎవరైతే, అల్లాహ్‌తోపాటు ఇతర దైవాలను ఆరాధించరో, మరియు అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో, మరియు వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. (సూరహ్ అల్ ఫుర్ఖాన్ 25:68). మరియు ఈ ఆయతు అవతరించినది: "ఇలా ప్రకటించు: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన, కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత." (సూరహ్ అజ్-జుమర్ 39:53)
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

కొంతమంది బహుదైవారాధకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. వారు (అప్పటికే) అనేక హత్యలకు, మరెన్నో మానభంగాలకు పాల్బడి ఉన్నారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఇస్లాంకు సంబంధించి మరియు దాని బోధనలకు సంబంధించి నీవు చెబుతున్నదీ, ఆహ్వానిస్తున్నదీ నిశ్చయంగా మంచి విషయం. అయితే బహుదైవారాధనలో మరియు ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) పడి ఉన్న మా పరిస్థితి ఏమిటి? దానికేమైనా పరిహారం ఉన్నదా?” అపుడు పైరెండు ఆయతులు అవతరించబడినాయి. వాటి ద్వారా అల్లాహ్ ఆ జనుల పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, వారు అత్యంత ఘోరమైన పాపములలో మునిగి ఉన్నప్పటికీ. ఒకవేళ అలా జరిగి ఉండకపోయినట్లయితే (ఆ రెండు ఆయతులు అవరించకపోయి ఉన్నట్లయితే) వారు తమ అవిశ్వాసములో మరియు ధర్మవిరుధ్ధ కార్యములలో, ఘోరమైన పాపములకు పాల్బడుటలో ఇంకా ముందుకు సాగిపోయేవారు.

Benefits from the Hadith

  1. ఇందులో ఇస్లాం యొక్క ఘనత మరియు గొప్పతనం తెలుస్తున్నాయి. ఇస్లాంలో రాకకు పూర్వం జరిగిన పాపములను తుడిచివేస్తుంది.
  2. అలాగే ఇందులో తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, ఆయన క్షమాభిక్ష, మరియు మన్నింపులను గురించి తెలుస్తున్నది.
  3. అలాగే ఇందులో బహుదైవారాధన హరాం (నిషేధము), (షరియత్ అనుమతించే) కారణము ఏదీ లేకుండా ఎవరినైనా చంపడం హరాం, వ్యభిచారము, అక్రమ లైంగిక సంబంధాలు హరాం అనే విషయాలు, మరియు ఈ పాపములకు పాల్బడే వారికి తీవ్రమైన హెచ్చరిక ఉన్నాయి.
  4. నిష్కల్మషమైన హృదయముతో చేసినటువంటి, నిజాయితీతో కూడినటువంటి పశ్చాత్తాపము, మరియు ఎక్కువగా సత్కార్యాలు చేయుట అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్బడి ఉన్నప్పటికీ, మరియు అనేక ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) మునిగి ఉన్నప్పటికీ – వాటన్నింటినీ తుడిచివేస్తుంది.
  5. పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క కరుణ పట్ల నిరాశ చెందుట హరాం అంటే నిషేధము.

కూర్పులు

విజయవంతంగా పంపబడింది