“ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంద...

Scan the qr code to link to this page

హదీస్
వివరణ
అనువాదాలను వీక్షించండి
Benefits from the Hadith
కూర్పులు
ఇంకా
అబూ మూసా అల్ అషారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంది”.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను కంఠస్థము చేయమని, అలా చేసి హృదయములో (జ్ఞాపకములో) భద్రపరుచుకున్న ఖుర్ఆన్ ను మరిచిపోకుండా ఉండుటకు గానూ దానిని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉండాలని ఆదేశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణం చేసి మరీ ధృవీకరిస్తున్నారు – ఏవిధంగానైతే ముందరి కాళ్ళను తాడుతో కట్టి వేసి ఉన్న ఒంటె, ఆ బంధం వదులుకాగానే అతి వేగంగా పారిపోతుందో, ఆ విధంగా ఖుర్’ఆన్ కూడా (పఠిస్తూ ఉండకపోతే) హృదయం నుండి జారిపోతుంది. అతడు ఆ తాడును పట్టుకుని ఉంటే అది ఉండిపోతుంది, వదిలివేస్తే అది పారిపోతుంది, అంటే అతడు దానిని కోల్పోతాడు.

Benefits from the Hadith

  1. ఖుర్ఆన్ కంఠస్థము చేసిన వ్యక్తి దానిని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉంటే అది అతని హృదయములో ఉంటుంది. అలా చేయకపోతే అతడు దానిని వదిలివేసిన వాడవుతాడు, మరియు అతడు దానిని మరిచిపోతాడు.
  2. ఖుర్ఆన్ ను నేర్చుకొనుట యొక్క ఘనత: దానికి గానూ అల్లాహ్ తరఫు నుండి ప్రతిఫలం మరియు పుణ్యము లభిస్తుంది. మరియు తీర్పు దినమున అతడి స్థానము ఉన్నతం చేయబడుతుంది.

కూర్పులు

విజయవంతంగా పంపబడింది